📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణజవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఉద్రిక్తత.. పలువురు నేతల ముందస్తు అరెస్టు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఉద్రిక్తత.. పలువురు నేతల ముందస్తు అరెస్టు

📰 Generate e-Paper Clip

మేడ్చల్, కీసర మండలాల్లో భారీ పోలీసు బందోబస్తు.. జేఏసీ ఆందోళనకు అడ్డుకట్ట

మేడ్చల్మ-ల్కాజిగిరి, జూలై 11(ప్రజా క్షేత్రం): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలంటూ జేఏసీ ఇచ్చిన ఆందోళన పిలుపు నేపథ్యంలో మేడ్చల్, కీసర మండలాల్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసన కార్యక్రమాలకు వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

తెల్లవారుజాము నుంచే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని కీసర పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు, జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను పూర్తిగా ఎత్తివేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular