📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణపోక్సో కేసులకు తెలంగాణ అడ్డాగా మారింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

పోక్సో కేసులకు తెలంగాణ అడ్డాగా మారింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

📰 Generate e-Paper Clip

పోక్సో కేసులకు తెలంగాణ అడ్డాగా మారింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన పోక్సో కేసు నిందితుడు
  • బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నేతల అరెస్ట్
  • నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉండటం దారుణమన్న ప్రవీణ్ కుమార్

శంకర్ పల్లి జులై 11(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసు కక్షతో… ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ కేసు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పటోళ్ల కార్తీక్ రెడ్డి వంటి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో ఈ అరెస్టులు జరిగాయి. ఈ నేపథ్యంలో, బీఆర్‌ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రం పోక్సో కేసులకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వం నిందితుడిని అరెస్టు చేయకుండా బీఆర్‌ఎస్ నాయకులను టార్గెట్ చేస్తోందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నిందితుడు ఇంకా పరారీలో ఉండటం దారుణమని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, బాధ్యులైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ధర్మానగారి గోవర్ధన్ రెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీధర్, బిఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ కన్న, ప్రభు, మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular