
బీసీ ఉద్యోగుల సంఘం కమిటీ పరిచయం
చెంగిచెర్ల, జూలై 21(ప్రజా క్షేత్రం): తెలంగాణ ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం చెంగిచెర్ల డిపో నూతన కమిటీని సోమవారం డిపో మేనేజర్‌కు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పరిచయం చేశారు. డిపో గౌరవ అధ్యక్షులుగా గడ్డం యాదగిరి, అధ్యక్షులుగా హనుమ గౌడ్, కార్యదర్శిగా జాంగిర్‌తో పాటు కమిటీ సభ్యులను పరిచయం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. తిరుపతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. నిరంజన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కె. రమేష్, కేజీ డిపో అధ్యక్షుడు ఉపేందర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేందర్ గౌడ్, ప్రచార కార్యదర్శి రోమన్ తదితరులు పాల్గొన్నారు.

