📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే

ఉప్పల్, ఆగస్టు 11(ప్రజా క్షేత్రం): ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, అర్హులైన పేదలకు ఇళ్ల మంజూరు తదితర అంశాలపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. నియోజకవర్గ పరిధిలో పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, అర్హులైన కుటుంబాలకు ఇళ్ల మంజూరు ప్రక్రియ, పెండింగ్‌ అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సచివాలయంలో సంబంధిత అధికారులతోనూ చర్చించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular