న్యాయ సేవలపై వాలంటీర్లకు అవగాహన
న్యాయ సేవలపై పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ
కుషాయిగూడ, సెప్టెంబరు 10(ప్రజా క్షేత్రం): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడలో పారా లీగల్ వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి. బాలభాస్కర్‌రావు ఆదేశాల మేరకు కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.ఎస్.ఎల్. ప్రియాంక హాజరై న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యాలు, వాలంటీర్ల హక్కులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. నెలవారీ కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో 15 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

