📄 ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeతెలంగాణకొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో పుట్టా శ్రీధర్..?

కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో పుట్టా శ్రీధర్..?

📰 Generate e-Paper Clip

  • పుట్టా శ్రీధర్ కు మండల నాయకుల నుండి లైన్ క్లియర్…?
  • మరికొందరు ఆశావహులు ఉన్నప్పటికీ పుట్టా శ్రీధర్ వైపే అధిష్టానం మొగ్గు…?
  • రైతులు, సంఘ సభ్యుల మద్దతు సైతం పుట్టా శ్రీధర్ కే..?

కోటగిరి సెప్టెంబర్ 10(ప్రజాక్షేత్రం):ప్రాథమిక సహకార సంఘాల నూతన కార్యవర్గాల ఎన్నిక నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నందున ఆయా సొసైటీ పరిధిలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకుంది. ఎన్నాళ్లుగానో సొసైటీ డైరెక్టర్లు, చైర్మన్ అవ్వాలని ఆశగా ఉన్న నాయకులందరూ పదవుల కోసం లోలోపల పావులు కదుపుతున్నారు. కొందరు నాయకులు స్థానిక సంఘ సభ్యులతో, రైతులతో మంతనాలు జరుపుతుంటే మరికొందరు నియోజకవర్గ నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. ఇటీవల కొన్ని సొసైటీల లో జరుగుతున్న అవకతవకల దృష్ట్యా ఆయా సొసైటీల రైతులు మాత్రం తమ సొసైటీని అభివృద్ధి చేసే నాయకుడినే ఈసారి చైర్మన్ గా నియమించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది. కొన్ని సొసైటీలో రైతులు సమావేశమై అభివృద్ధి చేసే నాయకుల పేర్లను సైతం చెబుతూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. సొసైటీని అభివృద్ధి చేసే నాయకులకు మాత్రమే నియోజకవర్గ నాయకులు సైతం పదవులు ఇవ్వాలని రైతులు సంఘ సభ్యులు బాహాటంగానే చెబుతున్నారు. అనుభవం, రాజకీయ పరిజ్ఞానం, లేని కొత్తవారికి అవకాశం కల్పిస్తే సొసైటీలు అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉందని రైతులు చెప్పకనే చెబుతున్నారు. రైతుల విషయం అటుంచితే ఈసారి సొసైటీ చైర్మన్ ల ఎన్నిక నామినేటెడ్ విధానంలో ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు యువ నాయకుడు పోచారం భాస్కర్ రెడ్డి వద్దకు ఆశావాహులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తుంది. రైతుల మద్దతు ఉన్నప్పటికీ నియోజకవర్గ నాయకుల మద్దతు ఉంటేనే నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆ దిశగా ఆశావహులు పావులు కదుపుతున్నారు. మండలంలోని కొత్తపల్లి సొసైటీలో సైతం ఈసారి జరిగే చైర్మన్ సహా పాలకవర్గం ఎన్నిక పై ఆసక్తి నెలకొంది. సొసైటీ పరిధిలో చాలామంది ఆశావహులు ఉన్నప్పటికీ మండల నాయకులు,అధిష్టానం మాత్రం యువ నాయకుడి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

కొత్తపల్లి చైర్మన్ బరిలో పుట్టా శ్రీధర్..?

కొత్తపల్లి సొసైటీ చైర్మన్ బరిలో యువ నాయకుడు బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పుట్టా శ్రీధర్ ఉన్నట్లు స్థానికంగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదట్లో కొత్తపల్లి సొసైటీ చైర్మన్ గా మండలానికి చెందిన ఓ సీనియర్ నాయకుడి పేరు ప్రచారంలో ఉండగా ప్రస్తుతం అనూహ్యంగా బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పుట్టా శ్రీధర్ పేరు తెరపైకి వచ్చింది. కొత్తపల్లి సొసైటీ పరిధిలో సొసైటీని సమర్థవంతంగా నిర్వహించే నాయకత్వ లక్షణాలు ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల్లో ఈయన ఉండటం మండలంలో జరుగుతున్న రాజకీయ కార్యకలాపాల్లో ఆయన చురుకుగా పాల్గొనటమే కాకుండా కొత్తపల్లి సొసైటీ పరిధిలోని ఆయా గ్రామాల్లో జరిగే అన్ని కార్యక్రమాలలో పుట్టా శ్రీధర్ కీలకంగా వ్యవహరించడం అంతేగాకుండా ఆయనకు ఒకటి రెండుసార్లు చైర్మన్ పదవి చేపట్టే అవకాశం వచ్చినప్పటికీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా వదులుకోవటంతో ప్రస్తుత పరిస్థితులు ఆయనకు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. సొసైటీ పరిధిలోని ఆయా గ్రామాల మెజారిటీ రైతులు, ముఖ్య నాయకులు పుట్టా శ్రీధర్ కు అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తుంది. రైతులతోపాటు మండలంలోని కీలక నేతలు సైతం పుట్టా శ్రీధర్ కే మద్దతు తెలుపుతుండగా ఆయనకు లైన్ క్లియర్ అయినట్లు చర్చలు నడుస్తున్నాయి. గతంలో సొసైటీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రస్తుతం సొసైటీ చైర్మన్ గా కొనసాగుతున్న డాక్టర్. సునీల్ కుమార్ రూ.5 లక్షల అప్పుల్లో ఉన్న సొసైటీని ప్రస్తుతం మూడు కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న సొసైటీగా అభివృద్ధి చేసినట్లు రైతులు చర్చించుకుంటున్నారు. సొసైటీ లో ఉన్న రైస్ మిల్ రెండు టన్నుల కెపాసిటీతో ఉండగా ప్రస్తుతం చైర్మన్ డాక్టర్.సునీల్ కుమార్ రైస్ మిల్ కెపాసిటీని నాలుగు టన్నులకు పెంచారు. దీంతో సొసైటీ ఆదాయం మరింత పెరిగింది. ఇంతే కాకుండా సొసైటీ పరిధిలోని రైతులకు సరిపడినంత యూరియా, ఎరువులు అందించడంలో చైర్మన్ కీలక పాత్ర పోషించారు. ఇలాంటి పరిస్థితుల్లో సొసైటీకి ఎన్నుకోబడే నూతన చైర్మన్ ప్రస్తుత చైర్మన్ కంటే దీటుగా పనిచేసి సొసైటీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే సోసైటీ పరిధిలోని నాయకులు రైతులు మండల ముఖ్య నాయకులు యుక్త వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించి సొసైటీని సమర్థవంతంగా నిర్వహించగల సత్తా ఉన్న నాయకుడిగా, ఇటు రైతులను అటు అధికారులను సమన్వయం చేస్తూ రైతుల సమస్యలను ఎల్లవేళలా పరిష్కరించగలిగే రాజకీయ అనుభవం ఉన్న బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పుట్ట శ్రీధర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చివరిదాకా కొనసాగితే పుట్టా శ్రీధర్ కొత్తపల్లి సొసైటీ చైర్మన్ గా నియమించబడటం లాంఛనమే కానుంది. ఒకవేళ పరిస్థితులు తారుమారై  అనుకోని సంఘటనలు జరిగి కొత్త వ్యక్తుల పేర్లు తెరపైకి వస్తే కొత్తపల్లి సొసైటీ చైర్మన్ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారే అవకాశం లేకపోలేదు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కొత్తపల్లి సొసైటీ చైర్మన్ ఎన్నిక నామినేటెడ్ పద్ధతిలో నిర్వహిస్తే బస్వాపూర్ సర్పంచ్ పుట్టా శ్రీధర్ పేరు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular