📄 ePaper
Sunday, September 20, 2026
📄 ePaper
Homeతెలంగాణడిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్‌ను సన్మానించిన బండమేది వెంకటేష్

డిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్‌ను సన్మానించిన బండమేది వెంకటేష్

📰 Generate e-Paper Clip

డిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్‌ను సన్మానించిన బండమేది వెంకటేష్

శంకర్ పల్లి సెప్టెంబర్ 15(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల డిప్యూటీ ఎమ్మార్వోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్తీక్ను బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బండమీది వెంకటేష్ డిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్‌కు భగవద్గీతను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలందించాలని ఆకాంక్షించారు. శంకర్‌పల్లి మండలంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను సానుకూలంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. డిప్యూటీ ఎమ్మార్వో కార్తీక్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular