Homeతెలంగాణకుషాయిగూడలో హెబ్బా పటేల్ సందడి

కుషాయిగూడలో హెబ్బా పటేల్ సందడి

📰 Generate e-Paper Clip

– చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సినీ నటి

కాప్రా, సెప్టెంబర్ 27(ప్రజాక్షేత్రం):కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ శ్రీలక్ష్మీ కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్‌కు టాలీవుడ్ నటి హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన దుస్తులు, వస్త్రాలు ఒకే చోట అందుబాటులో ఉండటం సంతోషకరమన్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 19 వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు. రానున్న పండుగలు, సెలవుల నేపథ్యంలో ప్రజలు ఎగ్జిబిషన్‌ను సందర్శించి తమకు నచ్చిన వస్త్రాలను కొనుగోలు చేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, భార్యాభర్తలు, స్నేహితులతో కలిసి వచ్చి షాపింగ్ చేయాలని కోరారు. ఎగ్జిబిషన్‌లో నాణ్యమైన డ్రెస్సు మెటీరియల్, పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, చిన్నారుల రెడీమేడ్ దుస్తులు, పంచెలు, ధోతీలు, దుప్పట్లు, బెడ్‌షీట్లు, కర్టెన్లు తదితర వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కర్మాగారాల నుంచి నేరుగా భారీ మొత్తంలో కొనుగోలు చేసి విక్రయిస్తున్నందున తక్కువ ధరలకు వస్త్రాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. పలు రకాల ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్య ప్రతినిధులు, సిబ్బంది, వినియోగదారులు, హెబ్బా పటేల్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular