రాక్షసులుగా మారిన రక్షకులు.
- జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కాకి శాఖకు మాయని మచ్చ
- బాధిత జర్నలిస్టులను పరామర్శించిన టిఆర్పీ నేతలు
- ఎస్ఐ శ్రీకాంత్‌ను శాశ్వతంగా విధుల నుంచి తొలగించాలి
- విచారణ జరిపి సీఐ, డీఎస్పీ లను సస్పెండ్ చేయాలని టిఆర్పీ డిమాండ్.
- టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా.
కరీంనగర్, అక్టోబర్ 15(ప్రజాక్షేత్రం):విధి నిర్వహణలో భాగంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి థర్డ్ డిగ్రీ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా అన్నాడు. సిరిసిల్ల జిల్లా గంబిరావుపేట ఎస్సై శ్రీకాంత్ చేసిన థర్డ్ డిగ్రీ లో గాయపడిన బాధిత జర్నలిస్టులు రాతిపెళ్లి సంపత్, శేకర్లను టీఆర్పీ నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు. బాధిత జర్నలిస్టులకు పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం టిఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మీడియాతో మాట్లాడుతూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ, అధికారులను ప్రశ్నించే జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అత్యంత హేయమైన చర్య అని తీవ్రంగా మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని, ఇలాంటి ఘటనలు పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. ఈ నెల 12వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో జర్నలిస్టులు రాతిపెళ్లి సంపత్, శేకర్లను కరీంనగర్ పట్టణ కేంద్రంలో అరెస్టు చేసి గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం ఎస్ఐ శ్రీకాంత్ థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు బాధితులు తెలిపారని పేర్కొన్నారు. ఎస్సై థర్డ్ డిగ్రీ చేస్తూ సిఐ మరియు డిఎస్పీలకు వీడియో కాల్ చేసి చేయిస్తూ వారిని ఆమెకు దుర్భాశలాడుతూ కర్కశంగా ప్రవర్తించారని తెలిపారని అన్నారు. వార్తలు రాస్తే కక్ష సాధింపులా, పోలీసులను ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూస్తే సహించేది లేదని అఖిల్ పాషా హెచ్చరించారు. అనేక అవినీతి ఆరోపణలు ఉన్న ఎస్సై శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదును సిఐ వెంకటేష్ మరియు డిఎస్పీ పరిశీలించకుండా ఎస్సై పాల్పడ్డ ఘటనకు సహకరించిన పోలీసు ఉన్నతాధికారులు సిఐ డిఎస్పీలపై జిల్లా ఎస్పీ నిష్పక్షపాత విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ శ్రీకాంత్‌ను ఈ రోజు ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్టు తెలిసిందని అటాచ్ చేయడం మాత్రమే సరిపోదని, శాశ్వతంగా సర్వీస్ ఫర్ రిమువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యత ఉన్నట్లు తేలితే సీఐ వెంకటేశ్, డీఎస్పీ నాగేంద్రచారిలను కూడా సస్పెండ్ చేయాలని కోరారు. బాధిత జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు టీఆర్పీ పోరాటం ఆగదని పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో బాధిత జర్నలిస్టులకు న్యాయం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అని అఖిల్ పాషా స్పష్టం చేశారు. వారితో పాటు పార్టీ నాయకులు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి చిగుర్ల మోహన్, కొత్తపెళ్లి మండల అధ్యక్షుడు ఓర్సు రాజు నాయకులు వెంకట్ గౌడ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.



