Homeతెలంగాణహంగర్గా గ్రామంలో సామూహిక కుంకుమార్చన

హంగర్గా గ్రామంలో సామూహిక కుంకుమార్చన

📰 Generate e-Paper Clip

హంగర్గా గ్రామంలో సామూహిక కుంకుమార్చన

  • శ్రీ దుర్గా సేన ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు.
  • నిత్య అన్నదానం ఏర్పాటుచేసిన ఉత్సవ కమిటీ సభ్యులు.

పోతంగల్ అక్టోబర్ 18(ప్రజాక్షేత్రం):పోతంగల్ మండలం హంగార్గా గ్రామంలో దుర్గామాత మండపం వద్ద ఆదివారం 18 మంది మహిళలతో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. దుర్గాష్టమి సందర్భంగా దుర్గామాతకు మాల ధారణ స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి దర్శనం చేసుకున్నారు. శ్రీ దుర్గా సేన దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో 9 రోజులపాటు నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో మాలధారణ స్వాములు, కండువా ధారణ స్వాములు నిత్యం అమ్మవారి సేవలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ… గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఇంట్లో సిరులు పొంగిపొర్లాలని అమ్మవారికి ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని. నిత్యం ప్రత్యేక పూజలు సామూహిక కుంకుమార్చన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామంలో అమ్మవారి దయతో పాడిపంట, పిల్లాపాప, గొడ్డుగోదా, క్షేమంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరు భక్తి మార్గంలో నడిచినప్పుడే గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరిస్తుందని సోదర భావం పెరిగే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నిష్టతో అమ్మవారికి నిత్యం పూజలు చేసిన గ్రామ మహిళలు, స్వాములు, ప్రజలకు సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular