Homeతెలంగాణతెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు.. ప్రభుత్వం కీలక ప్రతిపాదన!

తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు.. ప్రభుత్వం కీలక ప్రతిపాదన!

📰 Generate e-Paper Clip

తెలంగాణ రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు.. ప్రభుత్వం కీలక ప్రతిపాదన!

హైదరాబాద్ అక్టోబర్ 23(ప్రజాక్షేత్రం):తెలంగాణలో సామాన్య ప్రజలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను పరిశీలిస్తోంది. రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు పలు నిత్యావసర సరుకులను సబ్సిడీ ధరలకు అందించే అంశంపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే రేషన్ షాపుల ద్వారా గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి సరుకులు కూడా తక్కువ ధరలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరుకుల ధరలు, పంపిణీ చేసే పరిమాణం, అమలు విధానంపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. అధికారుల నివేదిక ఆధారంగా ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular