Homeతెలంగాణడిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల సమ్మె

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల సమ్మె

📰 Generate e-Paper Clip

డిసెంబర్ 15 నుంచి ఆశా వర్కర్ల సమ్మె

హైదరాబాద్ అక్టోబర్ 27(ప్రజాక్షేత్రం):తెలంగాణలో ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు. నెలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. వారి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అన్ని ఆశా వర్కర్ల సంఘాలు ఏకగ్రీవంగా సమ్మెకు తీర్మానించాయి. ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. గతానికి భిన్నంగా అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమ్మెకు నిర్ణయం తీసుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular