Homeతెలంగాణఎం.వి. రామన్ హైస్కూల్‌లో ఘనంగా స్పేస్ వన వీల్స్ కార్యక్రమం

ఎం.వి. రామన్ హైస్కూల్‌లో ఘనంగా స్పేస్ వన వీల్స్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

ఆత్మకూర్ అక్టోబర్ 28(ప్రజాక్షేత్రం):విద్యాశాఖ సూచనల మేరకు ఇస్రో. ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సైన్స్. స్పేస్ ప్రోగ్రాం 2026 మండల స్థాయి సైన్స్ ఫెయిర్లో భాగంగా ఎం.వి. రామన్ హైస్కూల్ (సీబీస్ ), ఆత్మకూరులో బుధవారం ‘స్పేస్ వన వీల్స్ ’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ ఎం. ఆన్సీ శ్రీధర్ గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిథులు విద్యార్థులకు ప్రసంగాలతో అవగాహన కలిగించారు. ముఖ్య అతిథి ఇస్రో–న్రస్సీ ఔట్‌రీచ్ ప్రతినిధి డా. ఆర్. శ్రీనివాస్ విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాలు, రాకెట్లు, గ్రహాలపై అవగాహన కల్పించారు. వనపర్తి డీఎస్పీ జి. గిరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. ఆత్మకూరు సీఐ టి. శివకుమార్ విద్యార్థులకు క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తన ప్రాముఖ్యతను వివరించారు. ఆత్మకూరు ఎస్సై జయన్న విద్యార్థులకు క్రమశిక్షణ ఉండాలని తెలిపారు. మండల విద్యాధికారి బి. శ్రీనివాసులు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. పాఠశాల చైర్మన్ డా. ఎం. శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఐఐటీ, నీట్ శిక్షణ, స్పేస్ ల్యాబ్, సైన్స్ ప్రయోగశాలల ద్వారా మెరుగైన అవకాశాలు కల్పించడమే పాఠశాల లక్ష్యమని తెలిపారు. ప్రిన్సిపల్ ఎం. ఆన్సీ శ్రీధర్ గౌడ్ విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంచుకొని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ ప్రదర్శనలో అంతరిక్ష విజ్ఞాన నమూనాలు, ఉపగ్రహాలు, రాకెట్లకు సంబంధించిన అంశాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular