శంకర్ పల్లి అక్టోబర్ 30(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఎండీ తాజోద్దీన్ నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆయనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా ఎండీ తాజోద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో లీగల్ సెల్ మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ చేర్మెన్ అశోక్ గౌడ్, వైస్ చేర్మెన్ యాదిరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రచారానికి కృషి చేస్తానని, న్యాయపరమైన సమస్యల పరిష్కారంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

