శంకర్ పల్లి అక్టోబర్ 31(ప్రజాక్షేత్రం): శంకర్ పల్లి పట్టణంలోని ఉడిపి గ్రాండ్ హోటల్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. హోటల్‌లో కస్టమర్లకు వడ్డించిన సాంబార్‌లో గండు చీమ కనిపించడంతో ఆహారం తీసుకుంటున్న వారు ఆందోళనకు గురయ్యారు. ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత పాటించాల్సిన హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల కస్టమర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి హోటల్‌లో పరిశుభ్రత ప్రమాణాలను తనిఖీ చేసి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

