Homeక్రైమ్ న్యూస్కేటీఆర్ ను కలిసిన డాక్టర్.ఎంఏ.హకీమ్

కేటీఆర్ ను కలిసిన డాక్టర్.ఎంఏ.హకీమ్

📰 Generate e-Paper Clip

  • రైతు గర్జన సభకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు

పోతంగల్, నవంబర్ 01(ప్రజాక్షేత్రం):పోతంగల్ మండలం నుండి ఆదిలాబాద్ లో బీ ఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన రైతు గర్జన సభకు భారీ ఎత్తున బిఆర్ఎస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. మండల బీఆర్ఎస్ నాయకులు హకీం ఆధ్వర్యంలో రైతు గర్జన సభకు బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. రైతు గర్జన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోతంగల్ మండలం ముఖ్య నాయకులు డాక్టర్ ఎం ఏ హకీమ్ కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం ఏ హకీమ్ మాట్లాడుతూ… ఆదిలాబాద్ లో నిర్వహించిన రైతు గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వచ్చిన కరువు కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగిస్తే తెలంగాణకు కరువు రాదని హితవు పలికారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు రైతుల సంక్షేమం కోసం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular