- ధన్యవాదాలు తెలిపిన గోశాల నిర్వాహకులు, ప్రజలు
కోటగిరి నవంబర్ 01(ప్రజాక్షేత్రం):నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్ గ్రామ సర్పంచ్ పుట్టా శ్రీధర్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని ఏకచక్ర గోశాలకు ఆదివారం పశు గ్రాసాన్ని తరలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుట్టా శ్రీధర్ మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం ట్రాక్టర్ ద్వారా గడ్డి కట్టలను కట్టించి బోధన్ పట్టణంలోని ఏకచక్ర గోశాలకు తరలించినట్లు చెప్పారు. అలాగే తమ గ్రామానికి చెందిన 9 దేవుని ఆవులను ఏక చక్ర గోశాలకు పంపించినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా బోధన్ ఏక చక్ర గోశాల నిర్వాహకులు పుట్టా శ్రీధర్ ను అభినందించి ధన్యవాదాలు తెలిపారు.గ్రామంలో ప్రథమ పౌరుడిగా ఉండి ఇలాంటి సేవ కార్య క్రమాలు చేయడం చాలా గొప్ప విషయమన్నారు.కేవలం పరిపాలనకు పరిమితం కాకుండా నోరు లేని మూగజీవుల కోసం తన సొంత ఖర్చులతో ట్రాక్టర్ ద్వారా 100 గడ్డి కట్టలను కట్టించి ట్రాక్టర్ ద్వారా తమ గోశాలకు తరలించడం శ్రీధర్ ఉత్తమ లక్షణమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుట్టా శ్రీధర్, రాజు, శ్రీనివాస్, ఖదీర్ మి య్య, వెంకట్, సమద్, ఫుల్య నాయక్, పాషా, తదితరులు పాల్గొన్నారు.

