- లిడ్ క్యాప్ భూముల పరిరక్షణకు మంద కృష్ణ మాదిగ పిలుపు
- యూనిట్ మాల్ నిర్మాణానికి భూముల కేటాయింపుపై అభ్యంతరం.
- పెట్రోల్ బంక్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ భూముల కేటాయింపు రద్దు చేయాలి.
- మాదిగ ఎమ్మెల్యేలతో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్తాం – కాలే యాదయ్య.
- ఎమ్మెల్యే కాలే యాదయ్యకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విజ్ఞప్తి.
మొయినాబాద్, నవంబర్ 13 (ప్రజాక్షేత్రం)హైదరాబాద్ గచ్చిబౌలి రాయదుర్గంలో ఉన్న లిడ్ క్యాప్‌కు సంబంధించిన భూములను పరిరక్షించి, వాటిని ఇతర అవసరాలకు కేటాయించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ కోరారు.ఈ మేరకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యను మొయినాబాద్ మండల కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసి, భూముల పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా గచ్చిబౌలి రాయదుర్గంలో ఉన్న లిడ్ క్యాప్‌కు చెందిన ఆరున్నర ఎకరాల భూమిని యూనిట్ మాల్ నిర్మాణం కోసం కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ భూముల కేటాయింపుపై ప్రభుత్వం పునరాలోచించి, తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.అదేవిధంగా పెట్రోల్ బంక్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు కేటాయించిన మూడున్నర ఎకరాల భూముల కేటాయింపును సైతం రద్దు చేసేలా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు.ఈ విజ్ఞప్తిపై ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పందిస్తూ.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరం కలిసి ఈ అంశంపై చర్చించి, లిడ్ క్యాప్ భూముల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఇజం వెంకట్ స్వామి మాదిగ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు గోవింద నరేష్ మాదిగ, ఎంఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ మాదిగ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ రాగల్ల ఉపేందర్ మాదిగ, గట్టగల ప్రశాంత్ మాదిగ, ఎంఎస్పి రంగారెడ్డి జిల్లా మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసారం శంకర్రావు మాదిగ, ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, ఎంఎస్ఎఫ్ మాజీ అధ్యక్షులు భాను ప్రసాద్, గుట్టకింద రవికుమార్ చిట్టిగిద్ద కిష్టయ్య,మొయినాబాద్ మండల అధ్యక్షులు కుమార్, ఎమ్మెస్ పి మండల అధ్యక్షులు దారుగుపల్లి రాజు, శంకర్ పల్లి మండల అధ్యక్షులు లింగం సాయి, చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లేష్, కొండిగారి మహేందర్, శంకర్ పల్లి మండల ఉపాధ్యక్షులు దాసరి నాగేష్, కటేకే మోహన్, ప్రసాద్, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



