– దేగాం పాఠశాలతో విడదీయలేని అనుబంధం రెండోసారి ఆత్మీయ పలకరింపు.
నిర్మల్ జిల్లా నవంబర్ 14 (ప్రజాక్షేత్రం):దేగాం, రాజన్న సిరిసిల్ల జిల్లా కనగర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోన్నతి పొందిన ఎం. వినోద్ కుమార్ను దేగాం గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు పాతర్ల నరేష్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి అనంతరం ఆయనను రెండోసారి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం గ్రామంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన వినోద్ కుమార్, ఆ సమయంలో గ్రామ పాఠశాలతో పాటు గ్రామస్థులతోనూ మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేస్తూ గ్రామ ప్రజల మన్ననలు పొందారు. దేగాం గ్రామంలో పనిచేసిన అనుభవాలు, ఆయనతో ఏర్పడిన ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పాతర్ల నరేష్ మరోసారి ఆయనను కలవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వినోద్ కుమార్కు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో తన ఉద్యోగ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, విద్యారంగంలో మరింత సేవలందిస్తూ మంచి గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

