📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నిరుపయోగంగా ఉన్న బస్సు షెల్టర్

నిరుపయోగంగా ఉన్న బస్సు షెల్టర్

📰 Generate e-Paper Clip

నిరుపయోగంగా ఉన్న బస్సు షెల్టర్

వేటపాలెం ఫిబ్రవరి 27(ప్రజాక్షేత్రం):వేటపాలెం మండల పరిషత్ కార్యాలయ సముదాయాల ముందు ఉన్న బస్సు షెల్టర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. మండలానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల, వెలుగు కార్యాలయం తదితర కార్యాలయాలు ఈ సముదాయంలోనే ఉండటంతో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. అయితే బస్సు షెల్టర్ సరిగా లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి ఎండాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎండలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకొని, ఎండాకాలం రాకముందే బస్సు షెల్టర్‌ను మరమ్మతులు చేసి మళ్లీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular