అంగరంగ వైభవంగా సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం
షాబాద్ మార్చి 27(ప్రజాక్షేత్రం):షాబాద్ మండలకేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ వేడుకకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదం శ్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారి కళ్యాణం వైభవంగా జరగగా, భక్తులు హర్షధ్వానాలతో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పావని చెన్నయ్య, రుద్రారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి,గ్రామ ప్రజలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

