📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeతెలంగాణప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధం: రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధం: రాహుల్ గాంధీ

📰 Generate e-Paper Clip

ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధం: రాహుల్ గాంధీ

  • అనంతగిరి హిల్స్‌లో జరిగిన శిక్షణా తరగతుల సమావేశంలో రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ విధానం అహింస, బీజేపీది హింసా విధానమని విమర్శ
  • ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారన్న రాహుల్ గాంధీ

వికారాబాద్ మార్చి 02(ప్రజాక్షేత్రం):ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ విధానం అహింసా పద్ధతి, కానీ బీజేపీది మాత్రం హింసా విధానమని అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ ఆలోచన అని విమర్శించారు. కానీ కాంగ్రెస్‌కు అధికారం ముఖ్యం కాదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భయపడుతున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఓ కాంగ్రెస్ కార్యకర్తగా నేను కోరుకునేది ఒకటేనని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేద్దామని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ మోదీపై యుద్ధానికి సిద్ధమని అన్నారు. డీసీసీ శిక్షణా తరగతుల ఈ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు ఏపీసీసీ చీఫ్ షర్మిల తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular