📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeజాతియంతమిళనాడు మంత్రివర్గంలోతెలుగు బిడ్డ

తమిళనాడు మంత్రివర్గంలోతెలుగు బిడ్డ

📰 Generate e-Paper Clip

తమిళనాడు: తమిళనాడులో తెలుగు బిడ్డగా గుర్తింపు పొందిన శివకాశి ఎమ్మెల్యే ఎస్ కీర్తనా చరిత్ర సృష్టించారు. శివకాశి నియోజకవర్గం నుంచి టీవీకే పార్టీ తరఫున విజయం సాధించిన ఆమెకు మంత్రి పదవి వరించింది. తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక మహిళగా కీర్తనా ప్రత్యేక గుర్తింపు పొందారు. యువ ఎమ్మెల్యేగా మంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్న కీర్తనకు శివకాశిలో సంబరాలు మిన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న కీర్తనా రాజకీయ ప్రస్థానం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular