ప్రొద్దుటూరులోని ఏళ్ల కరెంట్ సమస్యకు పరిస్కారం
- నూతన ట్రాన్సఫర్మార్ ప్రారంభించిన సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా
శంకర్ పల్లి మే 11(ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో 10వ వార్డులో సోమవారం నూతన ట్రాన్సఫర్మార్ ను గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా ప్రారంభించారు. ఈ వార్డు ప్రజలు గత కొన్ని ఏళ్ళుగా కరెంటు లోవోల్టేజ్ సమస్యలో బాధపడుతున్న ఆ సమస్యకు పరిస్కారం లభించలేదు కానీ ఇప్పుడు నూతనంగా ఎన్నికైన స్థానిక వార్డు సభ్యులు కవేలి తిరుపతి రెడ్డి స్థానిక ప్రజల కోరిక మేరకు సర్పంచ్ బండ లక్ష్మి నర్సింహా వద్దకు ఈ సమస్యను తీసుకపోవడంతో, ఆమె వెంటనే స్పందించి, నూతన ట్రాన్స్ఫర్మార్ ఏర్పాటు చేయడం సంతోషాన్ని కలుగచేసిందని, తన వార్డు అభివృద్ధికి నేనెపుడ్డు ముందుంటానని అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ వెంకటేష్, నాని ప్రభాకర్, మందుముల నర్సిములు, తదితరులు పాల్గొన్నారు.

