పోక్సో కేసులో రూ.20 లక్షల డీల్..?
- షాబాద్ లో ఆరుగురిని హత్య చేసిన రాజ్‌కుమార్ పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్.
చేవెళ్ల జూలై 13(ప్రజాక్షేత్రం):బాధిత బాలిక కుటుంబం తనపై పెట్టిన పోక్సో కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు.. రాజ్‌కుమార్ అక్షరాల రూ.20 లక్షలు ఇచ్చాడని సమాచారం. అంత భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చాడు కాబట్టే.. పోక్సో కేసులో కఠినమైన సెక్షన్లు పెట్టకుండా, స్టేషన్ బెయిల్ వచ్చే బలహీన సెక్షన్లు పెట్టినట్లు వార్తలు. పోలీసుల చేతికి డబ్బులు ముట్టడం వల్లే.. రాజ్‌కుమార్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితులు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని ఆరోపణ. ఈ నేపథ్యంలోనే.. అంతర్గత విచారణ జరిపి, ఒక్కొక్క అధికారిపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎస్సై రమేష్‌ను సస్పెండ్ చేయగా.. ఇప్పుడు సీఐ క్రాంతి రెడ్డిని సస్పెండ్ చేస్తూ సీపీ తరుణ్ జోషీ ఆదేశం.

