📄 ePaper
Monday, September 7, 2026
📄 ePaper
Homeతెలంగాణమ్యారీ గోల్డ్ మండి రెస్టారెంట్‌లో మండిలో జిల్ల పురుగు..

మ్యారీ గోల్డ్ మండి రెస్టారెంట్‌లో మండిలో జిల్ల పురుగు..

📰 Generate e-Paper Clip

మ్యారీ గోల్డ్ మండి రెస్టారెంట్‌లో మండిలో జిల్ల పురుగు..

  • వినియోగదారుల ఆవేదన

శంకర్ పల్లి జులై 08(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల పరిధిలోని భుల్కాపూర్ గ్రామ శివారులో ఉన్న మ్యారీ గోల్డ్ మండి రెస్టారెంట్‌లో వడ్డించిన మండి ఆహారంలో జిల్ల పురుగు కనిపించిందని ఇద్దరు వినియోగదారులు ఆరోపించారు. మంగళవారం సాయంత్రం మండి తినేందుకు రెస్టారెంట్‌కు వెళ్లిన వారు భోజనం చేస్తున్న సమయంలో ఆహారంలో పురుగు కనిపించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఆహార నాణ్యతపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వారు, సంబంధిత ఆహార భద్రత అధికారులు వెంటనే రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై అధికారుల స్పందన తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular