Homeతెలంగాణపేదింటి ప్రతిభకు అండగా బీఎస్ఆర్

పేదింటి ప్రతిభకు అండగా బీఎస్ఆర్

📰 Generate e-Paper Clip

పేదింటి ప్రతిభకు అండగా బీఎస్ఆర్

  • ఎంబీబీఎస్‌ సీటు సాధించిన మహేశ్వరికి అభినందనలు..
  • విద్యాభ్యాసానికి ఆర్థిక చేయూత

పెద్దేముల్, సెప్టెంబర్ 28(ప్రజాక్షేత్రం):కష్టపడి చదివితే పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపిస్తూ పెద్దేముల్ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సి.చెన్నప్ప కుమార్తె చాపల మహేశ్వరి ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. జయశంకర్ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించే అవకాశం దక్కించుకున్న మహేశ్వరి తన కుటుంబంతో పాటు మారేపల్లి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. చాపల మహేశ్వరి సాధించిన విజయాన్ని తెలుసుకున్న ఆర్‌బీఓఎల్ సీఈఓ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (బీఎస్ఆర్) ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా మహేశ్వరిని శాలువాతో సత్కరించి, ఆమె విద్యా ప్రస్థానానికి తనవంతు ప్రోత్సాహాన్ని అందించారు.

“మంచి వైద్యురాలిగా ఎదగాలి”

మహేశ్వరి భవిష్యత్తులో మరింత కష్టపడి చదివి మంచి వైద్యురాలిగా ఎదిగి సమాజానికి, ముఖ్యంగా పేద ప్రజలకు సేవలందించాలని బీఎస్ఆర్ ఆకాంక్షించారు.వైద్య విద్యకు సంబంధించిన ఖర్చుల కోసం తనవంతుగా కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యాభ్యాసం కొనసాగించే క్రమంలో భవిష్యత్తులో ఎలాంటి సహాయం అవసరమైనా తనను సంప్రదించాలని,మహేశ్వరి చదువుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని బీఎస్ఆర్ భరోసా ఇచ్చారు.

మారేపల్లి గ్రామానికి గర్వకారణం

మహేశ్వరి సాధించిన విజయం ఆమె కుటుంబానికే కాకుండా మారేపల్లి గ్రామానికి సైతం స్ఫూర్తిదాయకంగా మారింది. గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి చదివి వైద్య విద్యలో అడుగుపెట్టిన మహేశ్వరిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అభినందించారు.ఆమె భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఒక విద్యార్థి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంతో పాటు, ఆర్థికంగా అండగా నిలవడం ద్వారా బీఎస్ఆర్ అందించిన చేయూత మహేశ్వరి వైద్య విద్యా ప్రయాణంలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular