పర్యావరణహిత మట్టి వినాయకుల పంపిణీ
నాగారం, సెప్టెంబరు 13(ప్రజా క్షేత్రం): వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నాగారం డివిజన్–5లోని సాయి ధరణి నగర్ కాలనీ ఫేజ్–2లో శనివారం కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో సుమారు 100 మట్టి వినాయక విగ్రహాలను కాలనీ వాసులకు అందజేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రాజేందర్ విగ్రహాలను అందించారు. మట్టి విగ్రహాలను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గొలుసుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పులవర్తి శ్యామ్ తదితరులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

