Homeక్రైమ్ న్యూస్హాస్పిటల్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్..!

హాస్పిటల్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్..!

📰 Generate e-Paper Clip

హాస్పిటల్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్..!

  • ఏసీబీ వలలో రంగారెడ్డి డిఎంహెచ్ఓ స్వర్ణ కుమారి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 05(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో లంచాల పర్వం బట్టబయలైంది. రూ. లక్ష లంచం తీసుకుంటూ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డిఎంహెచ్ఓ) స్వర్ణ కుమారి అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నగరంలో ఓ నూతన ఆసుపత్రిని ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు (ప్రాసెస్) మంజూరు చేయడం కోసం డీఎంహెచ్ల్వో స్వర్ణ కుమారి రూ. లక్ష లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ వ్యవహారంపై ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా వ్యూహంతో రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి లంచం డబ్బులు స్వీకరిస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుంది..

కార్యాలయంలో తనిఖీలు..!

శివరాంపల్లిలోని డీఎంహెచ్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో స్వర్ణ కుమారితో పాటు లంచం వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసన్ను కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం డీఎంహెచ్ల్వో స్వర్ణ కుమారి, హెల్త్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ను ఏసీబీ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. ఆసుపత్రుల అనుమతుల పేరుతో గతంలో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular