Homeక్రైమ్ న్యూస్వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!

📰 Generate e-Paper Clip

  • ఇద్దరు చిన్నారులు, తల్లి మృతి.. చింతకుంటలో విషాద ఛాయలు
  • ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో హృదయ విదారక ఘటన

వికారాబాద్ బ్యూరో అక్టోబర్ 31(ప్రజాక్షేత్రం):వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం చింతకుంట గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాసవి అనే మహిళ తన ఇద్దరు పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం, తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వాసవి గత రెండు నెలలుగా వికారాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె చిన్న కుమారుడు అదే పాఠశాలలో చదువుతుండగా, మరో కుమారుడు పట్టణంలోని వేరే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నట్లు సమాచారం. వాసవి భర్త తాండూరు పట్టణంలోని ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular