- ఉమ్మడి దౌల్తాబాద్ రాయపోల్ మండలాలో రోడ్లు దారుణం.
- నిధులు మంజూరైన ప్రారంభం కానీ పనులు.
- అవస్థలు పడుతున్న వాహనాదారులు.
రాయపోల్ నవంబర్ 02(ప్రజాక్షేత్రం):నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్లన్నీ నరకానికి నకళ్లగా మారడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కనీసం రోడ్డుపై గుంతలు పూడ్చడం లేదని దీంతో వాహనాల రాకపోవడంతో ప్రయాణికులకు నిత్యం ప్రాణ సంకటంగా మారింది. ఈ రోడ్లను మరమ్మతు చేపడుతామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం రోడ్లను అభివృద్ధి చేస్తే వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఉమ్మడి దౌల్తాబాద్ రాయపోల్ మండల ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్, బేగంపేట, వడ్దేపలి, రామాపురం, గోలపల్లి, దౌల్తాబాద్ మండలంలోని తిర్మలాపూర్, ముబారాస్ పూర్, సూరంపల్లి, నుంచి ముత్యంపేట, దుల్తాబాద్ నుంచి నుంచి మహ్మద్ షాపుర్ నుంచి ఇందు ప్రియా ప్రియల్, మాచిన్ పల్లి, గొడుగుపల్లి, ఉప్పరపల్లి, గువ్వలేగి, తదితర గ్రామాలకు వెళ్లే రహదారులు గుంతల మయంగా ఉండడంతో నిత్యం ప్రయాణించే వాహనదారులు ప్రయాణికుడు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్లను మరమ్మత్తు చేపట్టాలని సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులకు వేడుకున్న సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కార్యరూపం దాల్చడం లేదు. ఎన్నికల సమయంలో రోడ్లను మరమ్మత్తు చేస్తామని హామీలు ఇచ్చిన ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆ గ్రామాల ప్రజలు అధికారులు ప్రజా ప్రతినిధులపై ఆగ్రహం తీస్తున్నారు. హైమద్ నగర్ నుంచి వయా తిరుమలాపూర్ రామారం, వడ్డేపల్లి బేగంపేట, నుంచి నాచారం టెంపుల్ వరకు రోడ్డు గుంతల మయంగా మారడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డుకు నిధులు మంజూరై సంవత్సరాలలు గడుస్తున్న పనులు ప్రారంభం రావడం లేదు. ఉమ్మడి దౌల్తాబాద్ రాయపోల్ మండలాల పరిధిలోని ఆయా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అద్వానంగా ఉండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్ల మరమ్మతకు శ్రీకారం చుట్టాలని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ప్రయాణికులు ఇబ్బందులను వాహనాదారుల ఇబ్బందులను తీర్చాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.


