నేషనల్ బ్యూరో నవంబర్ 08(ప్రజాక్షేత్రం):ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నక్సలిజంపై పోరాటంలో విధులు నిర్వహిస్తున్న భద్రతా బలగాల సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. నక్సలిజం నిర్మూలన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న భద్రతా సిబ్బందికి ప్రధాని సంఘీభావం తెలిపారు. ఒకప్పుడు నక్సలిజానికి కేంద్రంగా ఉన్న బస్తర్ ప్రాంతం ఇప్పుడు నక్సలిజం నుంచి విముక్తి పొందిందని పేర్కొన్నారు.

