📄 ePaper
Monday, September 21, 2026
📄 ePaper
Homeతెలంగాణ6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలి.

6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయాలి.

📰 Generate e-Paper Clip

  • తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైలం రెడ్డి.
  • బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి.

యాలాల సెప్టెంబర్ 08(ప్రజాక్షేత్రం):కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని బిఆర్ఎస్ నాయకత్వం డిమాండ్ చేశారు. యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాండూరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైలం రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రం కార్యాలయంలో ఎంపీడీవో శ్రీనిజ కు వినతి పత్రం అందించారు. నాయకులు, కార్యకర్తలు, సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ఆరు గ్యారెంటీ లతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ వడ్డే రాములు, మాజీ జెడ్పిటిసి సిద్రాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు రవిందర్ గౌడ్,బి. వెంకట్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్లు మంత్రి వెంకటయ్య, యువ నాయకుడు శేఖర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్, నాయకులు మెట్లి కృష్ణ, యువ నాయకులు సాయి కిరణ్, హాజీపూర్ రవి, జె. శ్రీనివాస్ గౌడ్, తిరుపతి, అంజయ్య గౌడ్, లాలయ్య, నారాయణ, రాజు నాయక్,యాదప్ప, సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular