📄 ePaper
Tuesday, February 24, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణ8వ వార్డు అభివృద్ధే లక్ష్యం : అనురాధ వెంకటరెడ్డి

8వ వార్డు అభివృద్ధే లక్ష్యం : అనురాధ వెంకటరెడ్డి

📰 Generate e-Paper Clip

8వ వార్డు అభివృద్ధే లక్ష్యం

 

– ధర్మన్న గారి అనురాధ వెంకటరెడ్డి కే ప్రజల మద్దతు…

శంకర్ పల్లి జనవరి 26(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మున్సిపాలిటీ 8వ వార్డు సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యం ఇస్తానని ధర్మన్న గారి అనురాధ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఇంటింటా తిరుగుతూ ప్రజలతో నేరుగా మమేకమవుతున్న ఆమెకు స్థానికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైనా, అనురాధ వెంకట్ రెడ్డి ప్రజల నుంచి దూరం కాలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, రహదారులు వంటి మౌలిక సమస్యలపై నిరంతరం పోరాడారు. అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం వల్ల ప్రజల్లో విశ్వాసం మరింత బలపడింది. ప్రజల కష్టాల్లో అండగా నిలిచిన నేతగా 8వ వార్డులో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈసారి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న ఆమెకు కు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అభివృద్ధే అజెండాగా, ప్రజలే తన బలం అంటూ ముందుకు సాగుతున్న అనురాధ వెంకటరెడ్డి ను గెలిపించేందుకు వార్డు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. కాగా అనురాధ వెంకటరెడ్డి గతంలో ఫత్తేపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిచే 10 సంవత్సరాలలు ప్రజలకు ఎనలేని సేవ చేశారు. ఈ అనుభవంతోటే వీరు వార్డు ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంవగా ఉన్నారు. అందుకోసం ఓటర్లు చేయి గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular