📄 ePaper
Tuesday, July 21, 2026
📄 ePaper
Homeతెలంగాణ“ప్రొద్దుటూరులో ఘనంగా ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ”

“ప్రొద్దుటూరులో ఘనంగా ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ”

📰 Generate e-Paper Clip

“ప్రొద్దుటూరులో ఘనంగా ప్రజాక్షేత్రం క్యాలెండర్ ఆవిష్కరణ”

 

శంకర్‌పల్లి, జనవరి 26(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ బండ లక్ష్మి నరసింహా ప్రజాక్షేత్రం దినపత్రిక ఎడిటర్ కాడిగల్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వారి నివాసంలో స్థానిక కార్యకర్తల సమక్షంలో ప్రజాక్షేత్రం తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బండ లక్ష్మి నరసింహా మాట్లాడుతూ పత్రిక సమాజంలో ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. “పత్రికల ద్వారా ప్రజలకు అప్‌డేట్స్ అందించడం మాత్రమే కాక, సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి కేంద్రీకరించడంలో వారధిగా ఉండడం అవసరం” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామసభ్యులు, యువకులు, పత్రిక సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వారు పత్రికకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి, విద్య, పౌర సౌకర్యాలపై స్థానికుల అభిప్రాయాలను పత్రికకు తెలియచేసారు. సర్పంచ్ బండ లక్ష్మి నరసింహా అన్నారు, “ప్రజల గొంతుగా నిలబడే విధంగా పత్రికలు ప్రజాస్వామ్యాన్ని మద్దతు ఇవ్వాలి. పత్రిక ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరం” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular