📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణతెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు

📰 Generate e-Paper Clip

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు

  • కే శ్రీనివాస్ రెడ్డిని కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్ ఫిబ్రవరి 25(ప్రజాక్షేత్రం):తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కె. శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 2024, ఫిబ్రవరి 26న రెండేళ్ల కాలానికి గాను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కె. శ్రీనివాస్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. కాగా, జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్న విశేష కృషిని ప్రభుత్వం గుర్తించి ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఆయన మరో రెండేళ్ల పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగనున్నారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మరియు ఇతర సంక్షేమ పథకాల అమలులో శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular