📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణపంచాయతీ కారోబార్‌పై దాడి.. కేసు నమోదు

పంచాయతీ కారోబార్‌పై దాడి.. కేసు నమోదు

📰 Generate e-Paper Clip

పంచాయతీ కారోబార్‌పై దాడి.. కేసు నమోదు

  • కులం పేరుతో దూషించారని ఫిర్యాదు
  • ఏడుగురిపై కేసు నమోదు
  • పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్

పెద్దేముల్, సెప్టెంబర్ 4 (ప్రజా క్షేత్రం)

పంచాయతీ అధికారిక విధులు నిర్వహిస్తున్న కారోబార్‌పై దాడి చేసి, కులం పేరుతో దూషించి అవమానించడంతో పాటు చంపుతామని బెదిరించిన ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కారోబార్ గొడుగు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి పెద్దేముల్ ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ తెలిపిన వివరాల ప్రకారం…..
పెద్దేముల్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ గత 13 సంవత్సరాలుగా కొండాపూర్ గ్రామ పంచాయతీలో కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్నారు.గురువారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న విషయమై నోటీసు జారీ చేసేందుకు మంగలి మొగులయ్య ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.ఈ క్రమంలో మంగలి సునీత, మంగలి స్వరూప, మంగలి నర్సింహులు, మంగలి శ్రీనివాస్, మంగలి జగన్, మంగలి నాగేష్‌తో పాటు వారి బంధువు శ్రీహరి తదితరులు తనను అడ్డుకుని దాడి చేసినట్లు గొడుగు శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు.తన చొక్కా పట్టుకుని లాగి, చెప్పుతో కొట్టి గాయపరిచారని, ఇతరుల సమక్షంలో కులాన్ని ఉద్దేశించి అవమానకరమైన పదజాలంతో దూషించారని ఆరోపించారు. అంతేకాకుండా చంపుతామని బెదిరించడంతో పాటు తమ ఇంటి సమీపానికి ఇకపై వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్లు తెలిపారు.సంఘటన సమయంలో నీరటి మల్లేశం, గొట్లపల్లి బుచ్చమ్మ, కొమిరె లింగయ్యలు అక్కడికి చేరుకుని నిందితులను అడ్డుకుని తనను రక్షించేందుకు ప్రయత్నించినట్లు గొడుగు శ్రీనివాస్ పేర్కొన్నారు.అయినప్పటికీ దాడి, దూషణలు కొనసాగినట్లు ఫిర్యాదులో వివరించారు.

కేసు నమోదు.. దర్యాప్తు ముమ్మరం

బాధితుడు గొడుగు శ్రీనివాస్ ఫిర్యాదు ఆధారంగా పెద్దేముల్ పోలీసులు సంబంధిత చట్టపరమైన నిబంధనల కింద కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతో పాటు,ఘటనకు సంబంధించిన అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని పెద్దేముల్ ఎస్‌ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular