📄 ePaper
Wednesday, July 22, 2026
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్అక్రమ ఇసుక రవాణా పట్టివేత

అక్రమ ఇసుక రవాణా పట్టివేత

📰 Generate e-Paper Clip

అక్రమ ఇసుక రవాణా పట్టివేత

అశ్వారావుపేట, ఫిబ్రవరి 26 (ప్రజాక్షేత్రం):అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టాటా టిప్పర్ లారీని పోలీసులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం జంగారెడ్డిగూడెం రోడ్ నుంచి అశ్వారావుపేట వైపు వస్తున్న అనుమానాస్పద టాటా టిప్పర్ లారీ నం. AP 39 TF 4891 ను ఆపి తనిఖీ చేశారు. లారీ డ్రైవర్ తన పేరు కొమల దుర్గ ప్రసాద్ (32), కోయలగూడెం గ్రామం, ఏలూరు జిల్లా నివాసి అని తెలిపాడు. విచారణలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోవ్వూరు ర్యాంపు వద్ద ఇసుకను లోడ్ చేసి, ఎటువంటి అనుమతి పత్రాలు లేదా ట్రాన్సిట్ పాస్‌లు లేకుండా సత్తుపల్లి ప్రాంతంలో అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు టాటా టిప్పర్ లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తదుపరి చర్యల కోసం కేసును మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular