9 ఏళ్ల బాలికపై అత్యాచారం..
- మైనర్ బాలికపై అత్యాచారం
- సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు
- జనం దాడిలో నిందితుడు మృతి
హైదరాబాద్ జులై 17(ప్రజాక్షేత్రం):హైదరాబాద్ నగరంలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కులసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అమానుషంగా అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. ఈ అకృత్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తమ చిన్నారిపై జరిగిన ఘోరాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు, ఆక్రోశానికి గురయ్యారు. ఈ దారుణం గురించి తెలియగానే ఆగ్రహంతో ఊగిపోయిన బాలిక తల్లిదండ్రులు, స్థానికులు కలిసి నిందితుడిపై తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సదరు నిందితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ నిందితుడు మరణించాడు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

