📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అక్రమంగా నాటు సార తయారు చేస్తున్న మహిళ అరెస్ట్ 4 లీటర్ల నాటు సారా స్వాధీనం

అక్రమంగా నాటు సార తయారు చేస్తున్న మహిళ అరెస్ట్ 4 లీటర్ల నాటు సారా స్వాధీనం

📰 Generate e-Paper Clip

అక్రమంగా నాటు సార తయారు చేస్తున్న మహిళ అరెస్ట్ 4 లీటర్ల నాటు సారా స్వాధీనం

ఎస్ ఐ భాగ్యరాజ్

బాపట్ల ఫిబ్రవరి 26(ప్రజాక్షేత్రం):వెదుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టువర్టుపురం గ్రామంలో ఈ రోజు ఎస్‌ఐ భాగ్యరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేయగా, మన్యం లక్ష్మీ అనే వ్యక్తి అక్రమంగా నాటు సారా తయారు చేసి విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు దాడి నిర్వహించారు. తనిఖీలలో నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం జరిగింది. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ భాగ్యరాజు ప్రజలకు తెలియజేస్తూ, ఎవరైనా నాటు సారాయి, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు లేదా దొంగ వస్తువులు కలిగి ఉండటం, కొనుగోలు చేయటం లేదా విక్రయించడం చేస్తే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ ప్రజలు అనుమానిత వ్యక్తుల గురించి సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular