📄 ePaper
Wednesday, March 25, 2026
ads
📄 ePaper
Homeక్రైమ్ న్యూస్పోస్టుమార్టం నివేదికకు వెల కట్టిన హోంగార్డ్

పోస్టుమార్టం నివేదికకు వెల కట్టిన హోంగార్డ్

📰 Generate e-Paper Clip

పోస్టుమార్టం నివేదికకు వెల కట్టిన హోంగార్డ్

కీసర, ఫిబ్రవరి 28(ప్రజాక్షేత్రం):మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసరలో లంచం వ్యవహారం వెలుగుచూసింది. పోస్ట్మార్టం నివేదిక ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్ నగేష్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తోటకూరు మహేశ్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోస్ట్మార్టం నివేదిక కోసం నగేష్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రిలో పరిచయం ఉన్న సందీప్ పేరును ప్రస్తావిస్తూ రిపోర్ట్ కావాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని నగేష్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. చివరకు మృతుడి మేనల్లుడు శరత్‌తో చర్చించి రూ.40 వేలకే ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారులు పన్నిన ఉచ్చులో భాగంగా మొదట రూ.5 వేలు తీసుకున్న నగేష్, రెండో విడతగా రూ.35 వేలు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. పట్టుకున్న డబ్బులను స్వాధీనం చేసుకున్న అధికారులు, నగేష్‌పై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular