📄 ePaper
Saturday, April 11, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణషాబాద్‌లో రెవెన్యూ అక్రమాల కలకలం

షాబాద్‌లో రెవెన్యూ అక్రమాల కలకలం

📰 Generate e-Paper Clip

షాబాద్‌లో రెవెన్యూ అక్రమాల కలకలం

  • “రికార్డులు లేవు” అంటూ రైతును వెళ్లగొట్టిన అధికారులు
  • పట్టాదారుడు బ్రతికుండగానే భూమి స్లాట్ బుకింగ్ ఆరోపణలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, మార్చి 31(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎట్ల ఎర్రవల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల వెంకటయ్యకు చెందిన 10 గుంటల భూమిని, అతను బ్రతికుండగానే వేరే వ్యక్తులకు స్లాట్ బుక్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాల ప్రకారం… వెంకటయ్య దశాబ్దం క్రితం ప్రైవేట్ వ్యక్తి వద్ద నుంచి 10 గుంటల భూమిని కొనుగోలు చేసి, రికార్డుల్లో నమోదు చేసుకున్నాడు. అయితే, అదే భూమి మరొకరి పేరుతో రికార్డుల్లో నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో తన భూమిని “మిస్సింగ్” కింద నమోదు చేయాలని బాధితుడు పలుమార్లు షాబాద్ తాసిల్దార్‌ను ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని చెబుతున్నాడు.

పంచనామా పత్రాల చింపివేత?

భూమిపై సర్వే నిర్వహించి పంచనామా రిపోర్ట్ ఇచ్చినా, డిప్యూటీ తాసిల్దార్ ఆ పత్రాలను చింపివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “నీ భూమికి రికార్డులు లేవు” అంటూ బాధితుడిని కార్యాలయం నుంచి పంపించివేసినట్లు సమాచారం.

విలేకరిపై బెదిరింపులు

ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన విలేకరిపై కూడా అధికారుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయానికి రావద్దని హెచ్చరించినట్లు సమాచారం.

ప్రజల్లో ఆగ్రహం

మండలంలో పేదల పనులు సాగడం లేదని, రెవెన్యూ కార్యాలయంలో అధికారులే తుది నిర్ణయాలు తీసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular