📄 ePaper
Thursday, July 23, 2026
📄 ePaper
Homeతెలంగాణమహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి: పట్నం మహేందర్ రెడ్డి

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి: పట్నం మహేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి: పట్నం మహేందర్ రెడ్డి

శంకర్‌పల్లి, ఏప్రిల్ 25(ప్రజాక్షేత్రం):మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఫత్తేపూర్‌లో శుక్రవారం జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఘనంగా ఆవిష్కరించారు. పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, వారు చూపిన మార్గంలో నడవడం ద్వారా సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వారు కలగన్న సమానత్వం, న్యాయం, సామాజిక అభ్యున్నతి వంటి లక్ష్యాలను సాధించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి భీంభరత్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్, ప్రజా గాయకుడు ఏవూరి సోమన్న, రేలారే గంగ, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రెడ్డి, మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు మద్దిలేటి మాదిగ, రాష్ట్ర నాయకులు క్యాసారం శంకర్ రావు మాదిగ కౌన్సిలర్ పీచరి అఖిల, నాయకులు రాములు, లింగం, బండమీది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular