హైదరాబాద్ జూన్ 25(ప్రజాక్షేత్రం):హైదరాబాద్‌లో బాలాపూర్ పీఎస్ పరిధిలోని షాహీన్‌నగర్‌లో గురువారం ఒక ఏటీఎం సాంకేతిక లోపం వల్ల నగదు విత్ డ్రా చేసిన వ్యక్తికి అదనంగా రూ. 2,200 వచ్చాయి. సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు ఏటీఎంను తాత్కాలికంగా మూసివేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం వల్లే ఈ అదనపు నగదు వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎం లావాదేవీలు, మెషిన్ పనితీరును పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు నగదు నష్టపోయినట్లు ఫిర్యాదులు అందలేదని, దర్యాప్తు తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
ఏటీఎంలో సాంకేతిక లోపం.. డ్రా చేసిన దానికన్నా ఎక్స్ట్రా క్యాష్!
0
28

