శంకర్ పల్లి మండల కుమ్మర సంఘం అధ్యక్షుడిగా కుమ్మర వెంకటేశం…
శంకర్ పల్లి, జూలై 04(ప్రజాక్షేత్రం)శంకర్ పల్లి మున్సిపల్ లోని మల్లికార్జున ఫంక్షన్ హాల్లో మండల కుమ్మర కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. మండల కుమ్మర సంఘం అధ్యక్షుడిగా శంకర్ పల్లి మున్సిపల్ కు చెందిన పత్తేపురం కుమ్మర వెంకటేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా ఎన్నుకున్న సంఘ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా కుమ్మర సంఘం అభివృద్ధికి మరింత కృషి చేస్తానని మరియు కుమ్మర కులస్తుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా సాయికుమార్, ఉపాధ్యక్షులుగా పాండు, బాలరాజ్, లక్ష్మణ్, కోశాధికారిగా పాండు, ప్రచార కార్యదర్శులుగా రాజు, వాసు, కార్యదర్శులుగా ఆంజనేయులు, పరమేష్, ముత్యాలు, గౌరవాధ్యక్షులుగా నారాయణ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మండల కుమ్మర సంఘం యూత్ అధ్యక్షుడిగా వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా రాజు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కుమార్, వెంకటేష్, రఘు, వెంకటేశం, మహేష్ తదితరులు ఉన్నారు.

