📄 ePaper
Sunday, September 6, 2026
📄 ePaper
Homeతెలంగాణచిన్నారుల చికిత్సకు పాలమూరు వాసి పాదయాత్ర

చిన్నారుల చికిత్సకు పాలమూరు వాసి పాదయాత్ర

📰 Generate e-Paper Clip

చిన్నారుల చికిత్సకు పాలమూరు వాసి పాదయాత్ర

మహబూబ్ నగర్ జూలై 13(ప్రజాక్షేత్రం):దేశంలో వెన్నుపాము, మెదడులోని నరాల కణాలను దెబ్బతీసే జన్యుపర మైన వ్యాధి(ఎస్ఎంఏ) తో బాధపడు తున్న చిన్నారుల చికిత్సకు తెలంగాణ, ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వం సహకరిం చాలని మహబూబ్ నగర్ కు చెందిన బయలుపాటి లక్కీ మహరాజ్ కోరారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని మంగళగిరి వరకు తాను చేపట్టిన పాదయాత్ర సోమవారం కోదాడ కు చేరుకుంది. ఎస్ఎంఏ వైద్యానికి రూ.16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని, పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎంలు చంద్రబాబునాయుడు, రేవంత్రెడ్డి స్పందించి సహకారం అందించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular