📄 ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణస్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం : కేఎస్‌ రత్నం

స్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం : కేఎస్‌ రత్నం

📰 Generate e-Paper Clip

స్థలాల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం : కేఎస్‌ రత్నం

మొయినాబాద్‌, జులై 16(ప్రజాక్షేత్రం):పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం ఆరోపించారు. మొయినాబాద్‌ మున్సిపాలిటీ హిమాయత్‌నగర్‌ గ్రామ ప్రజలు 60 గజాల స్థలం కోసం చేస్తున్న పోరాటానికి మద్దతుగా గురువారం బీజేపీ ఆధ్వర్యంలో డంప్యార్డ్‌ పక్కన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు వెంటనే స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ పడమటి మమతారెడ్డి, బీజేపీ మున్సిపల్‌ అధ్యక్షుడు మాధాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కందికొండ ప్రశాంత్‌గౌడ్‌, వివిధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular