రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన అబ్బాస్ ఖాన్…!
- పూడూరు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా నియామకం
వికారాబాద్ జులై 22(ప్రజాక్షేత్రం):కష్టపడ్డావానికి ఫలితం దక్కుతుంది… నిరీక్షణ వృధా కాదు… అనడానికి దో నిదర్శనం… పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన ఎండి అబ్బాస్ ఖాన్ 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆనాడు జరిగిన ఎంపిటిసి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. 2007 లో 32 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని నిర్ణయిస్తే కేవలం ఐదు గ్రామాల్లో మాత్రమే పార్టీ జెండా ఎగరవేసింది. మిగతా గ్రామాల్లో జెండా ఎగరవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో తాను ముందుండి ప్రతి గ్రామంలో జెండా దిమ్మెల కట్టి జెండాను ఎగరవేశాను అని ఆయన తెలిపారు. అధికారం ఉన్న లేకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుపుకొని పోయి ప్రతి గ్రామంలో పార్టీ పటిష్టత కోసం నిరంతరం కృషి చేశాడు. అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ కోసం కష్టపడ్డ అబ్బాస్ ను గుర్తించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నేడు మండల మైనార్టీ సెల్ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాక తన సతీమణికి గౌషీయా ఖాతూమ్ ను పూడూరు మండల పిఎసిఎస్ డైరెక్టర్గా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యున్నత కోసిన కృషి చేశానని ఏనాడు కూడా పదవుల కోసం పాకులాడలేదని ఆయన చెప్పారు. అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను తూచా తప్పకుండా పాటించానని అందులో భాగంగానే మండలంలోని గాను గ్రామంలో గాను సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల్లో తన వంతు కృషి చేసి అభ్యర్థుల గెలుపు కోసం తన వంతు కృషి చేశానని ఆయన తెలిపారు.. కండ్లపల్లి గ్రామంలో ఎన్నికల్లో సోమన్గుర్తి సునీత శ్రీనివాస్ బి ఫామ్, మన్నెగూడ గ్రామంలో లింగమ్మ బీఫామ్ ను తాను తీసుకొచ్చాను అని కొంతమంది వ్యతిరేకిచ్చిన బీఫామ్ తీసుకొచ్చి సునీతను గెలిపించానన్నారు. కొన్ని ఓట్లతో మన్నెగూడ లో లింగమ్మ ఓడిపోయింది అన్నారు.36 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ అభ్యున్నత కోసం కృషి చేస్తే ఈరోజు పార్టీ గుర్తించి మాకు పదవులు అప్పగించారన్నారు. తాను పార్టీకి ఏనాడు వ్యతిరేకంగా పనిచేయలేదు అన్నారు. సొంత నిధులతో కండ్లపల్లి గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు తాను చేపట్టానని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సహకారంతో మండల పెద్దల తో కలిసి గ్రామ గ్రామాల్లో తిరిగి మైనార్టీల అభ్యున్నతి కోసం తన వంతు పూర్తి చేస్తానన్నారు. కండపల్లి గ్రామానికి అధిక నిధులు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కృషి చేస్తున్నానని ఆయన వివరించారు. ప్రతి కార్యకర్తకు తాను అందుబాటులో ఉంటానని అండగా ఉంటానని అని తెలిపారు మారుతున్న కాలానికి అనుగుణంగా మనమంతా పార్టీ అభ్యున్నత కోసమే కృషి చేద్దామని ఆయన సూచించారు.


