📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణపెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. యువకుడిపై కేసు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. యువకుడిపై కేసు

📰 Generate e-Paper Clip

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం.. యువకుడిపై కేసు

కుషాయిగూడ, ఆగస్టు 21(ప్రజాక్షేత్రం):పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని, అనంతరం పెళ్లికి నిరాకరించాడని ఓ మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద నుంచి కొంత నగదు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన శివరాత్రి విష్ణువర్ధన్‌ (24)తో కొంతకాలంగా సంబంధం ఉన్నట్లు బాధితురాలు తెలిపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరకంగా కలిశాడని, ప్రస్తుతం పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular