📄 ePaper
Friday, September 4, 2026
📄 ePaper
Homeతెలంగాణఫీజు బకాయి బీజేపీ లడాయి

ఫీజు బకాయి బీజేపీ లడాయి

📰 Generate e-Paper Clip

ఫీజు బకాయి బీజేపీ లడాయి

  • నిరాహార దీక్ష చేపట్టిన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్
  • సంఘీభావం తెలిపిన బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్.

శంకర్ పల్లి ఆగస్టు 29(ప్రజాక్షేత్రం):తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ₹15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి – బీజేపీ లడాయి’ పేరిట రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలు ఉధృతంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో రంగారెడ్డి జిల్లా బీజెపీ అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్ నిరహార దీక్ష చేపట్టారూ. బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్ మాట్లాడుతూ… విద్యార్థులకు న్యాయం జరగకపోతే త్వరలోనే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బీజేపీ లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు ఆరోపణలు 40 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకపోవడం వల్ల దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక, ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమవుతున్నారని బీజేపీ ఆరోపించింది. చేవెళ్ల నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీద వెంకటేష్ మాట్లాడుతూ… కళాశాలల సంక్షోభం వల్ల బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక విద్యా వ్యవస్థ సంక్షోభంలో పడిందని విమర్శించారు. ప్రస్తుతం విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ పోర్ట్‌ఫోలియోను వదులుకోవాలని, రాష్ట్రానికి పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బండమీది వెంకటేష్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్ ను కలిసి సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular